|
|
|
| Dairy | Telugu Previews | | Cast: Sivaji, Shradha Das, Sajita, Dr Siva Prasad, Jeeva, Harshavardhan, Sridhar Rao and others Director:Machakanti Ramakrishna Producer:Kalyanram Chukka Music:Anand
 Synopsis 'డైరీ' చిత్రానికి దర్శకుడు రామకృష్ణ మచ్చకంటి. ఈ చిత్రంలో శివాజీ, శ్రద్దాదాస్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్రేట్ ఓషన్ ఎంటర్ టైన్ మెంట్స్, జెన్ నెక్ట్స్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ చుక్కా నిర్మాత.
నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ 'ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి మంచి విజయం సాదిస్తునందని ఆశిస్తున్నాం' అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ 'మంత్ర' తరహాలో రూపొందుతున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక డైరీ వల్ల ప్రధాన పాత్రలు ఎలాంటి చిక్కులో పడ్డారు? తర్వాత ఎలా బయటపడ్డారన్నది ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది. గతంలో వచ్చిన థ్రిల్లర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఆనందం సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది' అని అన్నారు. ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. |  |
|
|
|
|
|