Cast: Rajeev Kanakala, Navneet Kaur, Asmith, Prasanna kumar, Raghu Babu, Telangana Sakuntala, Uttej, Rallapalli, Dhulipala, Raghu, Bhaskar, Allari Subhashini, Priyanka and Others Director:suresh Producer:J.Samba Siva Rao Music:Sriram Vikas
 Synopsis 'జాబిలమ్మ' చిత్రానికి దర్శకుడు సురేష్. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, నవనీత్ కౌర్ జంటగా నటిస్తున్నారు. నిర్మాత జె.సాంబశివరావు శశిదర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం.
జె.సాంబశివరావు మాట్లాడుతూ "రెండు భిన్న మనస్తత్వాలున్న వారు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్లిద్దరి మధ్య ప్రేమ పుడితే పర్యవసానమేమిటి? అనే అంశం ప్రధానంగా సినిమాను రూపొందించాం". సురేష్ దర్శకత్వంలో ఈ చిత్రం ఒక విభిన్న ఇతివృత్తంతో రూపొందింది. కుటుంబ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఈ చిత్రం వినోద భరితంగా వుంటుందని సాంబశివరావు చెప్పారు. రాజీవ్ కనకాల, నవనీత్ కౌర్ ల ప్రాతలు ఆసక్తికరంగా సాగుతాయని ఆయన తెలిపారు. కోగంటి రామక్రిష్ణ, చల్లా సత్యవరప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వికాస్ సంగీతాన్ని సమకూర్చారు. అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయి. నవంబర్ 8న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. |  |
|